Sunday, June 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం..

పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం..

- Advertisement -

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై అసత్య ఆరోపణలు చేస్తే తగు చర్యలు
మండల అధ్యక్షుడు బొలుదేవేందర్
నవతెలంగాణ – తాడ్వాయి 
: అర్హత కలిగిన పేదలందరికీ ఇళ్ల కలను దశలవారీగా నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, వాటిపై తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దేవేందర్ మాట్లాడుతూ గత పదివేల టిఆర్ఎస్ పాలనలో ఎన్ని ఇండ్లు ఇచ్చారో చెప్పాలని వారు నిలదీశారు. అంతే కాకుండా మూడుసార్లు కేంద్రంలో గెలిచిన బిజెపి ప్రభుత్వం ఘర్ ఆవాస్ యోజన పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇల్లు ఇచ్చారు నిరూపించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కావాలని బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు. వీటితోపాటు ఐటీడీఏ తరఫున 1500 ఇండ్లు మంజూరు చేసిన ఘనత మంత్రి సీతక్కదే అన్నారు.కొన్ని చానల్లో వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కొంతమంది మీడియా సోదరులు తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదన్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేలా విడతల వారిగా ప్రతి సంవత్సరం ఇండ్లు ఇస్తాం అన్నారు. మళ్ళీ దసరా పండుగ సందర్భముగా రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం అని అన్నారు. నిజంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఏదైనా తప్పు జరిగితే నిరూపించి నిలదీయండి…అంతే కానీ సీతక్క మీద, కాంగ్రెస్ పార్టీ మీద కావాలని అక్కసుతో అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్ , మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెం లచ్చు పటేల్,  జిల్లా మహిళ అధ్యక్షురాలు  కళ్యాణి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎండీ ముజఫర్, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, డైరెక్టర్ జగన్ , గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్, నాయకులు జాజ శివ, చంద్రయ్య , జైపాల్ రెడ్డి, మధు, నరసింహులు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -