Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజాతీయ సమైక్యతకు కనెక్ట్‌ పెస్టివల్‌ దోహదం

జాతీయ సమైక్యతకు కనెక్ట్‌ పెస్టివల్‌ దోహదం

- Advertisement -

– వర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆయా రాష్ట్రాల మధ్య సంయుక్తంగా నిర్వహించే కనెక్ట్‌ ఫెస్టివల్స్‌ జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయని గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌ 25 నుంచి 27 వరకు, తిరిగి డిసెంబర్‌ 2 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో తెలంగాణ-నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌ ఫెస్టివల్‌ జరుగనున్నది. ఈ నేపథ్యం లో శుక్రవారం హైదరాబాద్‌ లోని రాజ్‌భవన్‌లో కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ఫెస్టివల్‌లో ఈశాన్య రాష్ట్రాలు-తెలంగాణ పలు అంశాల్లో తమ అనుభవాలను పంచుకునేందుకు ఫెస్టివల్‌ మంచి వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -