Sunday, May 11, 2025
Homeతెలంగాణ రౌండప్కలెక్టర్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయండి..

కలెక్టర్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయండి..

- Advertisement -

ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు సురుపంగా  ప్రకాష్….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
: వికలాంగుల హక్కుల సమస్యలు పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని ఎన్. పి.ఆర్.డి.జిల్లా అధ్యక్షులు సురూపంగా ప్రకాష్ కోరారు. శనివారం మండలంలోని నమాత్  పెల్లి , నందరం గ్రామాలలో16,17 న ధర్నా, ముట్టడి కార్యక్రమం కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి టౌన్  కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 16 17 తేదీల్లో జరగబోయే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడి విజయవంతం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులందరికీ అంత్యోదయ రేషన్ కార్డ్స్ ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి, దాంట్లో కూడా వికలాంగులకు స్పెషల్ కోట లో వికలాంగులకు ఇండ్లు కూడా మంజూరు చేయాలని కోరారు.  2010 నుండి పెన్షన్ పొందుతున్న ప్రతి వికలాంగులకి యూ డి ఐ డి కార్డు పంపిణీ చేయాలని స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసిన వారికి వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో వికలాంగులతో ప్రత్యేకంగా శ్రమ శక్తి సంఘాలను ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు జారీ చేసి 150 రోజులు పని కల్పించాలి రోజుకు 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.   ఈనెల 16 17 తేదీల్లో జరగబోయే ధర్నాకు అనేకమంది వికలాంగులు వచ్చి తమ ఆవేదనని చెప్పుకోవాలని  వికలాంగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్. పి.ఆర్. డి వివిధ గ్రామాల నాయకులూ సుల్తానా వీరాస్వామి, అంజయ్య, అయ్యన్న, సత్తయ్య, బాలయ్య  లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -