Saturday, September 13, 2025
E-PAPER
Homeజిల్లాలు83 పెండింగ్ అప్పీళ్ల పరిశీలన 

83 పెండింగ్ అప్పీళ్ల పరిశీలన 

- Advertisement -

 రాష్ట్ర సమాచార కమిషనర్లు వెల్లడి 

 నవతెలంగాణ వనపర్తి

 జిల్లాలోని సమాచార హక్కు పరిధిలోని పెండింగ్ అప్పీళ్ళయిన 83 దరఖాస్తులను దరఖాస్తుదారుల సమక్షంలో పరిశీలించామని రాష్ట్ర సమాచార కమిషనర్లు వెల్లడించారు. స్థానిక ఐడిఓసి సమావేశ హాలులో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వారు మాట్లాడారు. పెండింగ్ ఫైళ్లను పరిశీలించేందుకే వనపర్తి జిల్లాను సందర్శించినట్లు రాష్ట్ర సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు, బొరెడ్డి అయోధ్య రెడ్డి, వైష్ణవి మెర్ల తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో పి ఐ ఓ లు, ఏపీఐవోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం మధ్యాహ్నం కమిషనర్లు మూడు విభాగాలుగా వివిధ శాఖలకు సంబంధించి 83 సమాచార హక్కు పెండింగ్ అప్పీళ్లను దరఖాస్తుదారుల సమక్షంలో పరిశీలించారమని వెల్లడించారు. ఆయా దరఖాస్తులకు సంబంధించి సంబంధిత పిఐఓలకు పరిష్కరించే దిశగా సూచనలు చేసినట్లు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -