బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ దేశాయ్
మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ పెద్దకొడప్ గల్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు మానుకోవాలని మండల అధ్యక్షుడు విజయ్ దేశాయ్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని చౌరస్తాలో ఆధ్వర్యంలో బీఆర్ఎస్శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగామాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఫ్రీ బస్సు తప్ప ఇప్పటివరకూ ఏ ఒక్క హామీని నెరవేర్చలే దని మండిపడ్డారు. అసెంబ్లీలో ఒక రోజు సమా వేశం నిర్వహిస్తే భారీ వర్షాలతో పంట నష్టం, కొట్టుకుపోయిన, దెబ్బతిన్న రోడ్లపై చర్చిస్తారని అందరూ అనుకున్నారని, కానీ కాళేశ్వరం ప్రాజె క్టుపై కుట్రతో సమావేశం నిర్వహించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సీబీఐకి అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణ యాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుండపోత వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారని, జన జీవనం స్తంభించి పోతున్నదని. తెలిపారు. వ్యాధుల బారిన పడిన ప్రజలకు ప్ర భుత్వ దవాఖానల్లో సరైన వైద్యం అందడంలేద న్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినా వాటి లెక్కలు లేవన్నారు. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి పోయాయని, యూరియా లేక రైతులు గోదా ముల వద్ద పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా, కాళేశ్వరం ప్రాజె క్టుపై అనవసర రాజకీయాలు చేస్తున్నదని మండి పడ్డారు. కార్యక్రమంలో సొసైటి ఛైర్మన్ హాన్మంత్ రెడ్డి,సొసైటి డైరక్టర్ సాయాగౌడ్, మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి ,అశోక్ పటేల్,పండారి పటెల్,శివకుమార్ దేశాయి, మహమ్మద్, నందూ, సంగమేశ్వర దేశాయి, అంజన్న, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరంపై కుట్ర రాజకీయాలు మానుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES