కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
కేటీఆర్ కను సన్నల్లోనే కుట్ర రాజకీయాలు ఇక్కడ జరుగుతున్నాయని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ దే అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజా పాలన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి టిఆర్ఎస్ పార్టీ దోపిడీ పాలన కొనసాగించిందన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట అగయ్య గత పాలనలో దోపిడి దారులకు నాయకుడుగా వ్యవహరించి ఇప్పుడు నువ్వు శ్రీరంగనీతులు మాట్లాడుతున్నావా అంటూ మండిపడ్డారు.
ప్రజలకు అన్యాయం జరగద్దని ప్రతి విషయంలో బాధ్యతాయుతంగా పనిచేసే కలెక్టర్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.యూట్యూబ్ ద్వారా ఎదగాలనుకోవడం తప్పు కాదు..కానీ వ్యక్తిగత ఆరోపణలు చేయడం హేయమైన చర్య అన్నారు. తాత్కాలిక పద్ధతిలో టీచర్ల బదిలీలు జరిగితే కలెక్టర్ను నిందించడం సరికాదన్నారు.గత పాలకుల దోపిడీనీ ప్రశ్నించకుండా ..వ్యక్తిగత కక్షలతో కాంగ్రెస్ నేతలను అంతుచూస్తానని అనడం ఏంటి? అని ప్రశ్నించారు.ఓ జర్నలిస్ట్ ఒక నియంతల ప్రవర్తిస్తు కేటీఆర్ కనుసన్నల్లో సొంత ఎజెండా అమలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఈ పాత్రికేయ సమావేశం లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ళ నర్సింగం గౌడ్, పార్టీ నాయకులు లింగాల భూపతి,కట్కం రాజు,శ్రీకాంత్ గౌడ్,బైరినేని రాము,పొన్నాల పరుశురాం,మునిగల రాజు, కావట మల్లేశం,ఆరేపల్లి బాలు, గనది కిషన్,హరీష్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ కనుసన్నల్లోనే కుట్ర రాజకీయాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES