– ఓ ప్రైవేట్ కంపినీ ని ప్రోత్సహిస్తున్న అధికారులు
– ఆందోళన వ్యక్తం చేస్తున్న సాగు దారులు
– 12 అంశాలు ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ బాధ్యులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ఆయిల్ ఫెడ్ ను అస్థిరపరిచి,దేశం లోని ఆయిల్ పామ్ వ్యవస్థ ను,రైతులను నష్టపరిచేందుకు తెలంగాణ లోని ప్రైవేటు ఆయిల్ పామ్ కంపెనీలు కుట్ర పన్నుతున్నాయని,ఈ కంపెనీ యజమానులు కు పలువురు అధికారులు,అధినేతలు అండదండలు మెండుగా ఉన్నాయని, పామాయిల్ సాగుదారులకు ఏ చిన్న నష్టం వచ్చినా సహించేది లేదని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్రోయర్స్ అధ్యక్ష కార్యదర్శులు తుంబూరు ఉమా మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య లు స్థానిక ఆర్ అండ్ బీ అతిధి గృహం ప్రాంగణం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు 12 అంశాలు పై వారి అనుమానాలు ను, రైతులు కు జరిగే నష్టాన్ని ఏకరువు పెట్టారు.
ఈక్రమంలో అంశాలతో కూడిన లేఖను విడుదల చేసారు. తెలంగాణ హైకోర్టు లో తెలంగాణ లోని ఫ్యాక్టరీ జోన్స్ కేటాయించబడిన 13 ప్రైవేటు ఆయిల్ పామ్ కంపెనీస్ అన్ని కలిసి రిట్ పిటిషన్ నం: WP 3736/2026 తేదీ 05-02-2026 న ఆయిల్ పామ్ గెలలు కొనుగోలు కు కొలబద్ద అయిన ఓఈఆర్ నిర్ధారించే పద్ధతిని మార్చమని కేసు వేశారు.ఈ పద్దతి ని మారిస్తే రైతుల కు ప్రైవేటు కంపెనీలు తమ ఓఈఆర్ ను తక్కువుగా చూపి రైతులకు తక్కువ రేటు చెల్లించే ప్రమాదం ఉంది.
ఇదే విషయం పై గత 10 సంవత్సరాలనుండి అప్పారావుపేట, అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ అధికారులు ప్రైవేటు కంపెనీస్ తో కుమ్మక్కు అయి ఓఈఆర్ ను తక్కువుగా చూపి రైతుల ను నష్టపరిస్తున్నారు అని మేము పోరాటం చేస్తున్నాము, మరియు మా పోరాట ఫలితంగా విచారణ జరిపినా నివేదికను ఇప్పటివరకు బయట పెట్టలేదు.
మరో విచిత్రకమైన విషయం ఏమిటే అంటే ఈ 13 ప్రైవేటు కంపెనీస్ లో జోన్ అలోకేషన్ లో ఒక్కో కంపెనీకి ఒక జిల్లా కేటాయించి, 7 జిల్లాలు కేటాయింపబడిన,ఆయిల్ ఫెడ్ అన్ని ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్షన్, ఆపరేషన్,మెయింట్నెన్స్ టెండర్లు ఏకైక కంపెనీ ప్రీ యూనిక్ కే చెందే చేయడు,
గత 6 సంవత్సరాలనుండి మా అసోసియేషన్ ఆయిల్ఫేడ్ కు కాంపిటీటర్ అయిన ప్రీ యూనిక్ కు ఏక పక్షం గా టెండర్లు ద్వారా గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఆపరేషన్స్ అప్పగించటం వలన సంస్థకు, తద్వారా ఆయిల్ పామ్ రైతాంగానికి నష్టం జరుగుతుంది అని హెచ్చరిస్తూనే ఉన్నాము. ఇప్పుడు అదే ప్రీ యూనిక్ గవర్నమెంట్ పై కేసు వేయటం దానికి సాక్ష్యం. వెంటనే ఆయిల్ఫేడ్ టెండర్ల కేటాయంపు ఏకపక్షం గా ఇవ్వటం వెనుక ఎవరు ఉన్నారో తేల్చడానికి విచారణ చేపట్టాలి.
ఈ అసోసియేషన్ ఈ ప్రీ యూనిక్ ను కొందరు తెరవెనక ఉండి ప్రోచహిస్తున్నారు అని ఎప్పటినుండో ఆరోపిస్తున్నాము. గవర్నమెంట్ కు,ఆయిల్ పామ్ రైతాంగానికి వ్యతిరేకం గా వ్యవహరిస్తున్న ప్రీ యూనిక్ కు కేటాయించిన అన్ని ఆయిల్ ఫెడ్ కాంట్రాక్ట్స్ ను రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము.
గత రెండు రోజులుగా ఆయిల్ పామ్ నర్సిరీస్ పరిశీలిస్తున్న ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి గారు ఆయిల్ పామ్ నర్సరీ లో మొక్కల పెంపకం గురించి విలేకర్లు తో మాట్లాడుతూ నాణ్యత – పారదర్శకత – రైతు శ్రేయస్సు అనేది ఆయిల్ ఫెడ్ నినాదం అని చెప్పారు. కానీ ఆయిల్ పామ్ రైతులకు ఆయిల్ పామ్ నర్సరీ చూసేందుకు అనుమతి ఇవ్వమని ఆయిల్ ఫెడ్ ఎండీ,జీఎం , చైర్మన్ లకు రెండ్ సార్లు లెటర్స్ వ్రాసినా ఇప్పటివరకు స్పందించ లేదు. మరి చైర్మన్ గారికి అంత నాణ్యత తో పెంచే నర్సరీ రైతులకు చూపించటానికి ఎందుకు భయపడుతున్నారో?
ఇన్ని రోజులు అసలు ఆయిల్ పామ్ లో అసలు వంద్వత (హాఫ్టైప్ )మొక్కలు ఉండవు అని వాదించే ఆయిల్ పామ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఇప్పటి వరకు 29,000 హాఫ్ టైప్ మొక్కలు ఆయిల్ ఫెడ్ జేసీబు లతో తొలగించారు అని వారు చెప్పటం సంతోషం. ఇంకా ఇలా పీకాల్సిన తోటలు చాలా ఉన్నాయి అని వారు గుర్తుంచుకోవాలి. బాధిత రైతులు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా, కోర్టునుండి డైరెక్షన్స్ వచ్చినా స్పందించని ఆయిల్ ఫెడ్ చర్యలను సమర్థించి ఇప్పుడు రైతు శ్రేయస్సు గురించి మాట్లాడటం హాస్యాస్పదం.
అప్పటి మొక్కల పెంపకం లో అవినీతికి పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్స్ మీద విచారణ జరిపి రైతులకు కల్తీ మొక్కలు ఇచ్చినందుకు శిక్షించమని గత మూడు సంవత్సరాలనుండి మేము డిమాండ్ చేస్తూంటే అప్పుడు అసలు కల్తీ మొక్కలు లేవు అని ఈరోజు విచిత్రంగా కల్తీ మొక్కల బాధ్యులు అయిన అధికారులు మీద చర్యలు తీసుకోవాలి అనే మాట వారి నోటినుండి రావటం లో అర్థం ఏమిటో ?
హాఫ్ టైప్ మొక్కల విషయం లో ఇప్పటికి ఆయిల్ ఫెడ్ తీరు మారలేదు.ఉదాహరణ కి పాలడుగు నర్సరీ లో రిజక్ట్ చేసి ప్రక్కన పెట్టిన 70 వేల మొక్కలను కల్లింగ్ చేయ కుండా వాటిని వేల్పులపల్లి నర్సరీ కి తరలించి గ్రోత్ ప్రమోటర్స్ కొట్టి రైతులకు అంటగట్టాలి అనే ప్రయత్నం. ఆయిల్ ఫెడ్ లో మార్పు రాలేదు, రైతు శ్రేయస్సు గురించి పట్టదు అనేది దీనితో మరో సారి రుజువు అయ్యింది.
గిరిజన ప్రాంతం లో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం ఐనా భూములు ఉన్నా వాటికి సరి అయిన డాక్యుమెంట్స్ లేని రైతులకు, ధరణి లో తప్పుల వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు అని 2022 లోనే మంత్రులకు విన్నవిస్తే గత ప్రభుత్వం లోనే ఆదేశాలు జారీ అయ్యాయి. దాన్ని వక్రీకరించి చెప్పటం హాస్యాస్పదం.
ఆయిల్ పామ్ తోటల్లో విద్యుత్ లైన్ ల తొలిగింపు గురించి గ్రోయర్స్ సోసైటీ 2022 లో నాటి వ్యవసాయ మంత్రి కి రైతుల పంటల కు నష్టం కలిగించే విద్యుత్ లైన్లను ఎలెక్ట్రిక్ కంపెనీ వారికి అప్లికేషన్ పెట్టి రైతు స్వంత ఖర్చు తో లైన్ షిఫ్ట్ చేసుకునే వెసులుబాటు విద్యుత్ చట్టం లో ఉంది అని విన్నవించి, కొత్తగూడెం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వద్ద కూడా ఆయిల్ పామ్ రైతుల తరుపున కృషి చేశాము, దాని ఫలితమే ఇప్పుడు వచ్చిన సౌలభ్యం, అంతే తప్ప దీనిలో మరెవరి కృషి లేదు.
ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీస్ ద్వారా వచ్చే సీఎస్ఆర్ ఫండ్స్ ఈ ఫ్యాక్టరీ జోన్స్ లో ఆయిల్ పామ్ రైతుల కు ఉపయోగపడే రహదారుల అభివృద్ధికి వేయించమని చాలాకాలంగా పోరాడుతున్నాం. ఈ ఫండ్స్ ను ఇతరజిల్లలకు తరలించుకు పోతుంటే ప్రశ్నించేవారే లేరు.ఈ ఫండ్స్ స్కామ్ విషయం మేము ఆర్టీఐ ద్వారా బయటికి తెచ్చిన తరువాత కొద్దీ మొత్తం ఈ ప్రాంతం లో కేటాయించిన మాట మీకు విదితమే. అయినా ఇప్పటికి వివక్ష కొనసాగుతోంద
ఆయిల్ఫేడ్ ఆయిల్ పామ్ కలెక్షన్ సెంటర్స్ కుంభకోణం వర్ణించలేనిది. ఆయిల్ఫేడ్ ఎలాంటి టెండర్లు లేకుండా కొందరు పార్టీ కార్యకర్తలకు పునరావాసం లా వారికి ఇష్టం వచ్చినా వారికి కలెక్షన్ సెంటర్స్ ఇచ్చి పక్క రాష్ట్రాల నుండి దొంగ ఫ్రూట్ కొనటానికి, ఫ్రూట్ రాకున్నా వచ్చినట్లు దొంగ కాటా వేయటం, దమ్మపేట లో ఫ్రూట్ లోడ్ చేసి ములకలపల్లి నుండి వచ్చినట్లు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ తీసుకోవటం లాంటి అక్రుచాలకు నిలయం గా మారాయి. ఈ పద్దతి మార్చి ఎఫ్ఫీఓ, కోఆపరేటివ్ యూనియన్స్, ఫార్మర్ అసోసియేషన్స్, వుమెన్ గ్రూప్ కు కేటాయించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని డిమాండ్ చేసారు.



