Wednesday, April 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'ఉపాధి హామీ'ని తొలగించేందుకు కుట్ర

‘ఉపాధి హామీ’ని తొలగించేందుకు కుట్ర

- Advertisement -

– పేదలపై బీజేపీ సర్కార్‌ది కక్షపూరిత వైఖరి
– మోడీతో ఆ పార్టీ ఎంపీలు పోరాడి నిధులు తీసుకురావాలి:కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పేదలపై కక్షపూరిత వైఖరితో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కుట్ర చేస్తున్నదని తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు మంగళవారం వీడియో సందేశం విడుదల చేశారు. పని దినాల తగ్గింపు, నిధులు తగ్గించడానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన బీజేపీ ఎంపీలు మోడీపై పోరాడాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా పథకం పేరు మార్చి, తప్పనిసరిగా నిధులు ఇవ్వకుండా ఉండేందుకు చట్టబద్ధత లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినా కూడా అడిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొంత మేరకు మెరుగుపడిందని కవిత చెప్పారు. అలాంటి ఈ పథకం పని దినాలను తగ్గించటం, నిధులు ఇవ్వకుండా చేయటం ద్వారా గ్రామాల్లో పేదల కడుపు కొడుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోవిడ్‌ తర్వాత 2021-22 లో 14 కోట్ల పని దినాలు ఉంటే గతేడాది 7 కోట్లకు పని దినాలను తగ్గించారని మండిపడ్డారు. అదే విధంగా ఉపాధి హామీలో పని దినాలు కల్పించే ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని తెలిపారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్రంలో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ప్రజల కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పేద ప్రజల నోటికాడి కూడు లాగేస్తుంటే బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అన్యాయమన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఉపాధి హామీకి రావాల్సిన నిధులను తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -