నవతెలంగాణ-ఉప్పల్
ఆర్థిక సమస్యలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ మల్లికార్జున నగర్‌కు చెందిన డి.శ్రీకాంత్ (2009 బ్యాచ్) హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవాడు. కొంతకాలంగా అతను ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ మూడు నాలుగు రోజులుగా విధులకు సైతం వెళ్లడం లేదు. ఈ క్రమంలో అతను శనివారం ఇంట్లో చీరతో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తండ్రి మాణిక్‌రావు గది తలుపులు తీసి అతన్ని కిందకు దింపి చూడగా అప్పటికే చనిపోయాడు. మృతుడు కొంత కాలంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో కానిస్టేబుల్ ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



