- Advertisement -
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
కానిస్టేబుల్ ప్రమోద్ మరణం తీరనిలోటు అని వారి కుటుంబానికి బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని బ్యాంక్ కాలనీ లో ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రౌడీషీటర్ రియాజ్ చేతిలో హత్య గావించి మరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ మరణం తీరనిలోటని, విధి నిర్వహణలో భాగంగా ఆయన వీరమరణం పొందారు అని, ఆయన మృతి చెందడం ఎంతో బాధాకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ గౌరవ అధ్యక్షులు కోయడి నర్సింహులు గౌడ్, అధ్యక్షులు రమణగౌడ్,రాష్ట్ర నాయకులు దాసరి మూర్తి, నారాగౌడ్, మహిళ అధ్యక్షురాలు గైనీకాడి విజయ లక్ష్మి, నరేష్ పాల్గొన్నారు.
- Advertisement -



