ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా టీపీటీఎఫ్ హైదరాబాద్ జిల్లా తరఫున శుభాకాంక్షలు
నవతెలంగాణ_ సిటీ బ్యూరో:
విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించి, ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన అనంతరం ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి అహర్నిశలు ముత్యాల రవీందర్ శ్రమించారు. హైదరాబాదు జిల్లా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో అగ్రగామిగా నిలిచి, తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేస్తూ.. రాష్ట్రస్థాయిలో క్రియాశీల నాయకత్వాన్ని చాటిన వారి సేవలు మరువలేనివి. గణితం, ఆంగ్లం రంగాలలో విశిష్ట ప్రతిభాపాటవాలు కలిగిన శ్రేష్ఠ వ్యాఖ్యాత, స్నేహశీలి, సమగ్ర నాయకుడు రవీందర్.. హైదరాబాదు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్న శుభ సందర్భంగా టీపీటీఎఫ్ హైదరాబాదు జిల్లా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.