Saturday, July 5, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్CM Revanth Reddy : రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరగబోతున్నాయి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరగబోతున్నాయి: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -








నవతెలంగాణ హైదరాబాద్: ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో కార్యకర్తలు తమను గెలిపించారని.. ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను, స్థానిక నాయకులను గెలిపించే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి 119గా ఉన్న సీట్లు 150కిపైగా అవుతాయని.., పార్లమెంట్‌ సీట్లు కూడా పెరగబోతున్నాయని.. మహిళలకు రిజర్వేషన్లు అమలు కానున్నాయని చెప్పారు. అంతే కాకుండా ఐదారుగురు మంత్రులుగా వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. కార్యకర్తలకు అన్ని పదవులు దక్కే వరకూ విశ్రాంతి తీసుకోబోనని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని.. దాని కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా తనదే బాధ్యతని చెప్పారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -