Friday, November 28, 2025
E-PAPER
Homeజాతీయంఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుక

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుక

- Advertisement -

గుంటూరు : కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌ కూడా తన అన్ని కార్యాలయాలు, శాఖలలో ఈ కార్యక్రమాలను చేపట్టింది. గుంటూరులోని హెడ్‌ ఆఫీసులో జరిగిన కార్యక్రమానికి ఒఎస్‌డి ఎం అరుణ్‌ కుమార్‌, విజిలెన్స్‌ ఇంచార్జ్‌ హరిష్‌ బేత, జనరల్‌ మేనేజర్లు, అలాగే వివిధ విభాగాల సిబ్బంది హాజరయ్యారు. ఉద్యోగులంతా రాజ్యాంగ పీటిక పఠనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత రాజ్యాంగం సమగ్రత, స్థిరత్వం, సౌలభ్యత, మరియు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం, వంటి అనేక కీలక లక్షణాలను కలిగి ఉందని విజిలెన్స్‌ ఇంచార్జ్‌ హరిష్‌ బేత పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -