నేడు విస్తృత స్థాయి సమావేశం
13న జాతీయ రహదారుల దిగ్బంధం : జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే డిమాండ్‌తో శనివారం (నేడు) హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కళింగ భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13న జాతీయ రహదారుల దిగ్బంధం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. 11న నిర్వహించే సమావేశంలో అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, సామాజిక తత్వవేత్తలు పాల్గొంటారని వెల్లడించారు. ఆ సమావేశంలో చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. హైకోర్టు స్టేను నిరసిస్తూ శుక్రవారం అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాల లాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. భవిష్య త్తులో బీసీల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES