– భూభారతి చట్టం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం: రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
– నకిరేకల్‌లో ఇందిరమ్మ నమూనా ఇల్లు ప్రారంభం
నవతెలంగాణ-నకిరేకల్
రాబోయే నాలుగేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకు కట్టించి ఇస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇంటిని గురువారం ప్రారంభించారు. అదేవిధంగా ఆపరే షన్ సిందూర్‌కు మద్దతు తెలుపుతూ నకిరేకల్ పట్టణంలో ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటి విడతలో ప్రతి నియోజక వర్గానికీ 3500 చొప్పున ఇండ్లు కేటాయించామని, ఇంకా 3 విడత లుగా ఇండ్లను ఇస్తామని చెప్పారు. భూ సమస్యలను పరిష్కరించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ కానుం దన్నారు. జూన్ 2 నుంచి ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసీ ల్దార్ స్థాయి అధికారులు వచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారని తెలి పారు. భూభారతిలో పెండింగ్‌లో ఉన్న 926000 (తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేలు) సాదాబైనమాల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ పూర్తి హక్కులు కల్పించనున్నామన్నారు. భూభారతిలో నకిరేకల్‌ను పైలెట్ మండలంగా తీసుకున్నామన్నారు. ప్రజాపాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో 650 కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక తాగు నీటి ఏర్పాట్లు చేశామన్నారు. గడిచిన 15 నెలల్లో వైద్యంపై 11800 కోట్లు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం ఏడాదికి రూ.5650 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. 58 నియోజకవర్గాల్లో రూ.11,600 కోట్లతో ప్రతి నియోజకవర్గంలోనూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ పాఠశాలలు కట్టిస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం కోరిక మేరకు నకిరేకల్ మండలానికి నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవా దాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని మంత్రి తెలిపారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లను పారదర్శకంగా కేటాయిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలోనూ ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసి రెండు వందల ఇండ్లకు ఒక గెజిటెడ్ అధికారిని ఏర్పాటు చేసి సర్వే నిర్వహిం చిన తర్వాత జాబితా రూపొందించామన్నారు. ఆ జాబితాను ఇన్‌చార్జి మిని స్టర్ ఆమోదంతో లబ్దిదారులకు ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువగా కేటా యించాలని, తహసీల్దార్ కార్యాలయం నూతన భవనాన్ని మంజూరు చేయా లని, గతంలో ఎస్‌ఎల్ బిసీ కోసం తీసుకున్న భూముల సమస్యను పరిష్క రించాలని మంత్రిని కోరారు. ఇనుపాముల గ్రామంలో ఒకే వ్యక్తిపై 50 నుంచి 100 ఎకరాలు లెక్కించిన దానిని సరి చేయాలని కోరారు. ఈ కార్యక్ర మంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లి కంటి సత్యం, శంకర్‌నాయక్, మిర్యా లగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ శంబయ్య, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ అమిత్ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్, మిర్యాల గూడ సబ్ కలెక్టర్, ఇన్‌చార్జి రెవె న్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్, గృహనిర్మాణ శాఖ పీడి రాజ్‌కుమార్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES