Monday, May 19, 2025
Homeకరీంనగర్సిరిసిల్లలో క్రికెట్ స్టేడియం నిర్మాణం: ఆది శ్రీనివాస్

సిరిసిల్లలో క్రికెట్ స్టేడియం నిర్మాణం: ఆది శ్రీనివాస్

- Advertisement -

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – సిరిసిల్ల
: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వాగు పక్కన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేయడం జరుగుతుందని ప్రభుత్వ  విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన పర్యటించారు. పట్టణంలోని రైతు బజార్ ను పరిశీలించారు. అనంతరం మానేరు వాగు పక్కన ఉన్న స్థలంను క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం పరిశీలించారు. అనంతరం పట్టణంలోని గ్రంథాలయం ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కోసం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళుతుందని అన్నారు. దీంట్లో భాగంగానే పట్టణంలోని ఐదు ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అలాగే వేములవాడ నియోజకవర్గంలో కూడా 5 ఎకరాల స్థలంలో  స్టేడియం నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. బోయినపల్లి మండలంలో ని ఐదు ఎకరాల స్థలంలో స్టేడియం నిర్మాణం చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పేద మధ్యతరగతి ప్రజల కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడిందని వారి సంక్షేమం కోసం నిరంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎందుకు క్రికెట్ స్టేడియం నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మంత్రిగా పనిచేసి వేములవాడ అభివృద్ధి అసలే పట్టించుకోలేదని ఆయన అన్నారు. సిరిసిల్ల వేములవాడ రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని అన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయంకు వెళ్లి మాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా,  కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు,మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెల్మూల స్వరూప, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బొప్ప దేవయ్య, కల్లూరి చందన, ఆడెపు చంద్రకళ, బొద్దుల శ్రీనివాస్,గుడ్లపెల్లి గౌతమ్, శంకర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -