Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబనకచర్లను తక్షణమే ఆపాలి : కూనంనేని

బనకచర్లను తక్షణమే ఆపాలి : కూనంనేని

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులతో ముందుగా మాట్లాడాలని ఆయన అన్నారు. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దూం భవన్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు.

ముఖ్యాంశాలు

* కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం వృథా అని మేము చెప్పలేదు. మేడిగడ్డ , సుందిల్ల, అన్నారం ప్రాజెక్ట్ ల వలన 10వేల కోట్ల విద్యుత్ భారం పడుతుంది. ఇంత ఖర్చు పెడితే ఆ నీళ్లు ఎల్లంపల్లికి నీళ్లు రావాలి..

* ఆ మూడు కాకుండా మిగతా మల్లన్న సాగర్ లాంటివి అన్ని మంచి బ్యారేజ్ లే..

* కూలీ పోయిన వాటికి రిపేర్లు చేయాలంటే 20వేల కోట్లు కావాలి.

* మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి అక్కడ ప్రాజెక్ట్ కట్టలేదని బీఆర్ఎస్ చెబుతుంది. కానీ ప్రాణహిత దగ్గర ప్రాజెక్ట్ కట్టడం వలన ఆదిలాబాద్ కు, తెలంగాణకు ఉపయోగపడుతుంది..

* భవిష్యత్ తరాలకు కాళేశ్వరం ఉపయోగపడాలంటే.. అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ తీసివేసి తుమ్మిడి హేట్టి దగ్గర ఒక కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి.

* తెలంగాణను సంప్రదించకుండా బనకచర్ల చంద్రబాబు కడుతున్నారు. దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము.

వృథా జలాలను ఎవరి వాటా వారు వాడుకోవాలి.

* సీతారామ ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లు పూర్తి చేయడంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి.

* ఆంధ్రా బనకచర్ల నిర్మాణం ఆపివేయాలి. తెలంగాణ ప్రభుత్వం బనకచర్లపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలి.

* నేను జలనిపుణడు కాను.. నేను కేసీఆర్ లాగా అపర మేధావినీ కాదు.

* ప్రాజెక్ట్ కు లక్ష కోట్ల ఖర్చు అయ్యింది.. అందులో ఎంత అవినీతి అయ్యింది ఎంత ఖర్చు అయ్యిందో కమిషన్ చెపుతుంది.

* కమిషన్ తొందరగా లెక్కలు తేల్చాలి దోషులను కటినంగా శిక్షించాలి.

* తుమ్మీడి హేట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -