సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని అనాజిపురం నుండి రాయిపహాడ్ తండతో పాటు వివిధ గ్రామాలకు రాకపోకలు సాగించే చిన్నేరు వాగుపై తక్షణం బ్రిడ్జి నిర్మాణం చేయాలని, గ్రామాలలో పేరుకపోయినా ప్రజాసమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం, పెంచికల్ పహాడ్, రామకృష్ణాపురం గ్రామాలలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. పెంచికల్ పహాడ్ గ్రామంలో అధిక వర్షాలతో నష్టపోయిన పదిమంది రైతులకు వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, గ్రామంలో స్మశాన వాటిక నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, అనాజిపురం గ్రామంలో అర్హత కలిగిన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గ్రామాలలో రోడ్లు, మురికి కాలువలు, వీధిలైట్ల సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయని ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి పరిష్కరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గెలిస్తే పెన్షన్స్ పెంచి ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ అమలు చేయలేదని గత ఏడ ఎనిమిది సంవత్సరాలుగా అన్ని అర్హతలు ఉండి దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, వితంతులు, వృత్తిదారులకు ఇప్పటికైనా పెన్షన్స్ మంజూరు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమిలేని పేదలందరికీ అమలు చేయాలని, మహిళలకు ఇస్తానన్న రూ.2500 తోపాటు గ్యాస్ సబ్సిడీని కూడా ఇవ్వాలని అన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న లింకు రోడ్ల సమస్య పరిష్కరించాలని, పెంచికల్పాడు గ్రామంలో నుండి వెళ్ళుచున్న బస్వాపురం ప్రాజెక్టు కాలువకు తూములు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్న చెరువులన్నీ నింపి రైతాంగానికి సాగునీరు అందించాలని, భునాదిగాని కాలువలో భూములు కోల్పోతున్న రైతాంగానికి మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని అంజయ్య డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం రేపు మండల తహశీల్దార్ కార్యాలయం ముందు జరుగు ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్ , సిపిఎం అనాజిపురం రెండవ శాఖా కార్యదర్శి కడారి కృష్ణ, పెంచికలపహడ్ శాఖ కార్యదర్శి సుబ్బురు పోచయ్య, రెండు గ్రామాలకు సంబంధించిన సీపీఐ(ఎం) కార్యకర్తలు, ప్రజలు ఎండి వలి, బొల్లేపల్లి స్వామి, తోటకూరి మల్లేష్, కడమంచి నరసింహ, గోపి సాయిలు, సుబ్బురు లక్ష్మి, బాసాని యాదయ్య, నాగారపు నాగయ్య, కడారి మల్లయ్య, గంగదారి శంకరయ్య, బొల్లెపల్లి యాదగిరి, పన్నాల దినేష్, సిలువేరు ప్రమీల, బాలమణి, సరిత, సుజాత, లక్ష్మి, భాగ్యం లు పాల్గొన్నారు.
చిన్నెరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం తక్షణం చేపట్టాలి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES