బురదామాయం లేని గ్రామంగా తీర్చిదిద్దుకుందాం
ఆలేరు గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని ఆలేరు గ్రామంలో మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో రూ.10 లక్షలతో సిసి రోడ్డు పనులను ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి తెలిపారు. ఎన్.ఆర్ ఈజిఎస్ నిధుల నుండి రూ .10 లక్షలతో 5వ, ఆరవ వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని అన్ని వీధులలో సిసి రోడ్లు త్వరలో వేయిస్తామని అన్నారు.
గ్రామంలో ఏ వీధిలో కూడా బురదమయం లేకుండా ఉండేందుకు ఈ సీసీ రోడ్డు పనులు ఐదవ, ఆరవ వార్డులోని కాలేరు వీరయ్య ఇంటి వద్ద నుండి గుదే గోపాల్ ఇంటి వరకు ఈ పనులను చేస్తున్నామని అన్నారు. మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హరీష్,వార్డు సభ్యులు వీరన్న,,భాగ్యలక్ష్మి, సుగుణమ్మ, భవాని, అక్తర్, మల్లేష్, కృష్ణ, సుధాకర్, మల్లేశం, గుదే యుగేందర్, పంచాయతీ కార్యదర్శి మనీదీప్ తదితరులు పాల్గొన్నారు.



