నవతెలంగాణ – భువనగిరి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటీ లబ్ధిదారులు అయిన మల్లెబోయిన ప్రేమలత తో కలెక్టర్ మాట్లాడుతూ స్లాబు లేవల్ వరకు జరుగుతున్న పనులు త్వరగా పనులు పూర్తి చేయాలి తెలిపారు.
ఇప్పటివరకు అయినంత వరకు బిల్లులు మీ అకౌంట్ లో జమ అయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. మోత్కూరు మున్సిపల్ , మండల పరిధిలో ఇప్పటి వరకు నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ పనులు వేగంగా జరుగుతున్నాయా అని మున్సిపల్ కమిషనర్ ని , తహసీల్దార్ ని వివరాలు అడిగారు. ఇందిరమ్మ నిర్మా ణ పనులు త్వరగా జరిగేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రతి సోమవారం లబ్ధిదారుల అకౌంట్ లలో డబ్బులు జమ అవుతున్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES