నవతెలంగాణ – జుక్కల్ : గ్రామాలలో బేస్మెంట్ లెవల్ లో ఉన్న ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వారందరూ త్వారగా నిర్మాణ పనులను చేపట్టాలని జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ అన్నారు. శనివారం నాడు మండల కేంద్రంలోని గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులను గుర్తించి ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని గ్రామాలకు సంబంధిత గ్రామ కమిటీ సభ్యుల తీర్మానం మేరకు లబ్ధిదారులను గుర్తించామని వారికి ఇంటి నిర్మాణాల కొరకు మంజూరు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే పలువురు గృహ నిర్మాణాలు పూర్తి చేశారని వారికి పూర్తిగా డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశామని అన్నారు. ఇంకొంతమంది ప్రారంభ దశలో ఉన్నారని, బేస్మెంట్ లెవల్లో మరియు రూట్ లెవల్లో లబ్ధిదారుల ఇంటి నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. మంజూరైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణాలు గడువులోగా పూర్తిచేసి కొత్త ఇంటిలో నివాసం ఉండాలని వారి సమయానుకూలంగా గృహప్రవేశాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలం కేంద్రంలోని పలువురు లబ్ధిదారులతో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు గృహ నిర్మాణాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



