Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం

బస్వాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను సోమవారం ఎంపీడీవో శ్రీనివాస్ మార్కౌట్ చేశారని జిపి కార్యదర్శి భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు సురేష్ గుండా ఆధ్వర్యంలో పలువురి లబ్ధిదారుల గృహ నిర్మాణాలు ఏర్పడుతున్న వారి నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. బస్వాపూర్ గ్రామానికి మొత్తం 31 ఇందిరమ్మ గృహ పథకంలో లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేశామన్నారు. వాటిలో 22 వరకు స్టార్టింగ్ దశ లెవల్లో ఉన్నాయని, 9 రూఫ్ లెవెల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని, నాలుగు బేస్మెంట్ లేవలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గృహ నిర్మాణాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -