Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కత్తల్వాడిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం

కత్తల్వాడిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని కత్తల్వాడిలో బుధవారం సర్పంచ్ గోపాల్ రావు ఆధ్వర్యంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ముగ్గు పోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, సర్పంచ్ లు మాట్లాడుతూ.. గ్రామంలో సొంతిల్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్,  గ్రామ సర్పంచ్ గోపాల్ రావు, జిపి కార్యదర్శి, గృహ నిర్మాణాల లబ్ధిదారులు, గ్రామ పెద్దలు , జిపి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -