Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైబాపూర్, కంఠాలి జీపీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం

మైబాపూర్, కంఠాలి జీపీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మైబాపూర్, కంఠాలి జీపీ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాలను ఎంపిడిఓ శ్రీనివాస్ ముగ్గు వేసి పనులను మైబాపూర్ గ్రామ సర్పంచ్ కారేగామా బశవ్వ అశోక్ రెడ్డి , కంఠాలీ సర్పంచ్ మాత్రే నాగనాథ్ తో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మరియు గ్రామ సర్పంచ్ లు మాట్లాడుతు గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకం మంజురైన లబ్ధిదారులు గృహ నిర్మాణాలను వెంటనే ప్రారంభించుకోవాలి అన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఇంటి స్థలం కొలతల ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు , జిపి కార్యదర్శి, జిపి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -