Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహమ్మదాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం

మహమ్మదాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మహమ్మదాబాద్ జిపి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సోమవారం జిపి కార్యదర్శి జీవన్ రాథోడ్ ఇందిరమ్మ పథకంలో మంజూరైన లబ్ధిదారుల గృహ నిర్మాణాలకు ముగ్గు వేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను ప్రారంభించాలని సూచించారు. పనులను పూర్తి చేస్తే మూడు విడతలుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం మాత్రమే ఇంటి నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు తెల్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు జిపి పాలకవర్గం , జిపి కార్యదర్శి , గ్రామ పెద్దలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -