నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని బంగారు తల్లి మోడల్ గ్రామంలో మొదటి విడతలో ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా మంజూరైన ఇంటి నిర్మాణాలను లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహప్రవేశానికి సిద్ధం చేశారని చుక్కలు ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నాడు ఎంపీడీవో బంగారు పల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ.. గృహ నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో డబ్బులు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు తరలు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని లబ్ధిదారులు అధికారులకు తెలియజేశారని తెలిపారు.
పూజ చేసిన ఇంటి నిర్మాణాల కలరింగ్, పూజా రూమ్ , కిచెన్ రూమ్ , రెండు బెడ్రూంలు, ఫ్లోరింగ్ , డోర్స్ , విండోస్ , బాత్రూమ్స్, ఎలక్ట్రికల్ వర్క్ పనులను ఎంపీడీవో క్షుణ్ణంగా పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు వెంటనే గృహ నిర్మాణ ప్రవేశ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
బంగారుపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES