Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపూర్ లో చురుకుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు

బస్వాపూర్ లో చురుకుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చురుకుగా కొనసాగుతున్నాయి. బస్వాపూర్ గ్రామానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. బస్వాపూర్ గ్రామానికి 31 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. వారికి బస్వాపూర్ గ్రామ ప్రజల తరఫున గ్రామ సర్పంచ్ వాగ్మారే రమణ సురేష్ గొండ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం 31 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా.. మార్కౌట్ 22 ఇండ్లు, బేస్మెంట్ లెవెల్ లో మూడు, రూమ్ లెవెల్ 3, ఆర్సిస్ లెవెల్ 8, గ్రౌండ్ లెవెల్ 8 ఇండ్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపీడీవో, బి. శ్రీనివాస్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గ్రామ చిన్న పెద్దలు తదితరులు కలిసి 5 ఇందిరమ్మ ఇండ్ల కొరకు ముగ్గులు వేసి మార్కౌట్ ఇచ్చి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -