నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా ఇందిరమ్మ గృహాల నిర్మాణాలు వేగవంతంగా జరగాలని ఎంపీడీవో మమత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి ఇన్చార్జ్ ఎంపీ ఓ డేగల శంకర్ తో కలిసి ఇందిరమ్మ గృహ నిర్మాణాల తీరును ఎంపీడీవో మమత పరిశీలించారు.ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు వచ్చిన లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు, ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న మేస్త్రీలను, పని వాళ్లతో మాట్లాడుతూ, లబ్ధిదారులు సకాలంలో పైసలు ఇస్తున్నారా లేదా తెలుసుకున్నారు, వర్షాలు ఎక్కువగా వస్తున్నందున, ముందస్తుగా స్లాబ్ పోసే లబ్ధిదారులు, ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని, అలాగే పరదాలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని, మీరు ఇల్లు నిర్మించిన ప్రకారం బిల్లులు అందుతాయని, తెలిపారు, ఇంటి నిర్మాణంలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీకు ఎప్పుడు అందుబాటులో , పంచాయతీ కార్యదర్శి శంకర్ , ఇందిరమ్మ ఇళ్ల పరిశీలకుడు ఏఈ ఇసాక్ హుస్సేన్ అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఇందిరమ్మ గృహాల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలి: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES