- Advertisement -
నవతెలంగాణ – ఊరుకొండ
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నారు. శుక్రవారం ఊరుకొండ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అదేవిధంగా ఊరకొండ పేట గ్రామంలో నిర్మాణ పనులను వేగవంతం చేయుటకు, ఇంకా నిర్మాణం చేపట్టని లబ్ధిదారులు వెంటనే పనులను ప్రారంభించుటకు పలు సూచనలు సలహాలు ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో చేయడం జరిగింది. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఇబ్రహీం, మోతిలాల్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -