Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల  నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి: ఎంపీడీవో

ఇందిరమ్మ ఇండ్ల  నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి: ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లబ్ధిదారులు వేగంగా పూర్తి చేయాలని ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్, ఆదేశాల మేరకు ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై  సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పేద కుటుంబాలు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లకు మెటీరియల్ తక్కువ ధరలకు అందించాలి, అధిక ధరలు వసూలు చేయరాదని ట్రేడర్స్, మేస్త్రీలకు సూచించారు.అలాగే ఇసుక రవాణా తక్కువ ఖర్చుతో చేయాలని, ఇండ్ల నిర్మాణం ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి అయ్యేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో తహసీల్దార్ ఆంజనేయులు,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,ఎంపీవో అనురాధ,ఏఈ ( హౌసింగ్) జ్యోతి,ఏఎస్ఐ ఆంజనేయులు,మెటీరియల్ సరఫరాదారులు,పంచాయతీ కార్యదర్శులు,వార్డ్ ఆఫీసర్లు,ట్రేడర్స్ యజమానులు, ఇటుక బట్టి యజమానులు,మేస్త్రీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -