Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను వెంటనే చేపట్టాలి: ఎంపీడీఓ

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను వెంటనే చేపట్టాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన  నిర్మాణాలు చేపట్టాలని జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని కంఠాలి గ్రామంలో  జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారులతో ఇంటింటికి వెళ్లి పర్యటించి వారితో ముచ్చటించారు. ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వారికి పలు సూచనలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క లబ్ధిదారులు ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం గృహ నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో లబ్ధిదారులకు సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్మాణాలు చేపడితే బిల్లులు మంజూరు కావని లబ్ధిదారులకు తెలిపారు.

కొంతమంది మంజూరైన ఇంటి నిర్మాణాలు నేటికీ కూడా పనులు ప్రారంభించకపోవడంతో అటువంటి లబ్ధిదారులందరినీ గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపట్టడానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నారు వారిని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే నేరుగా కార్యాలయానికి రావాలని తమతో చర్చించాలని సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని ప్రతి ఒక్క గృహ నిర్మాణాలు చేస్తున్న లబ్ధిదారులకు ఎంపీడీవో గారితో వివరించారు. నిర్మాణాలు చేపడుతున్న వారికి వెనువెంటనే వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమా చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో జిపి రికార్డులను ఎంపీడీవో పరిశీలించారు.

రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పెండింగ్ ఉంచకూడదని కార్యదర్శికి ఆదేశించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతుగా నిత్యం కృషి చేయాలని గ్రామస్తులకు సమస్యలు తలెత్తకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి సాహయ సహకారాలు అందించాలని జిపి కార్యదర్శికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు జిపి కార్యదర్శి ఇందిరమ్మ పథకంలో మంజూరైన గృహ నిర్మాణ లబ్ధిదారులు , గ్రామ పెద్దలు , తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -