Saturday, May 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బంగారుపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు..

బంగారుపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని బంగారు పల్లి మోడల్ గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను వేగవంతం చేశారని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. గురువారం బంగారు పల్లి గ్రామాన్ని ఎంపీడీవో శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామంలోని లబ్ధిదారులు ప్రారంభించిన ఇంటి నిర్మాణ పనులను హరితగతిన నిర్మించేందుకు నిత్యం మండల టీం పనిచేస్తుందని తెలిపారు.  ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులను పూర్తి చేసేందుకు అదేవిధంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి డబ్బులు అన్ని వారి ఖాతాలో జమ చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసేమని అన్నారు.  ఎప్పటికప్పుడు పూర్తయిన పండ్లను పరిశీలించి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేయడం జరిగిందని, అందుకే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేస్తున్న లబ్ధిదారులు పనులను వేగవంతం చేశారని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో ఒక ఇంటి నిర్మాణం స్లాబ్  వేయడం పూర్తయిందని , 2 ఇండ్లు స్లాబ్ వేసేందుకు సెంట్రింగ్ వేయడం ప్రస్తుతం జరుగుతుందని,  రెండు రోజులలో పని పూర్తవుతుందని , నాలుగు గృహాలు ప్రస్తుతం గోడ నిర్మాణాలు పూర్తయినవి అని తెలియ చేసారు. ఇందిరమ్మ పథకం గృహ నిర్మాణాలను పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -