సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగ్రవాల్..
నవతెలంగాణ- రాయపోల్
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం తొందరగా ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టిన వారికి విడుతలవారీగా రూ.5 లక్షల అందజేస్తుందని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రామారం గ్రామంలో ఇందిమ్మ ఇండ్లను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను తనిఖీ చేసి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు.
అనంతరం రామారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.రామారం గ్రామం పైలెట్ ప్రాజెక్టు కిద మొత్తం 183 ఇండ్లు మంజూరు అయ్యాయని, వాటిలో 17 ఇండ్లు మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారు. 90 ఇండ్లు లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టలేమని ప్రభుత్వానికి తిరిగిచ్చారు. మిగతా లబ్ధిదారులందరూ త్వరగా నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నాలుగు విడతలలో ఐదు లక్షల రూపాయలు అందజేస్తుందన్నారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడడం జరిగిందని ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే సిమెంటు, ఇసుక, ఐరన్ తెచ్చుకోవడంలో ఎదురయ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
లబ్ధిదారులకు బిల్లులు పడటంలో ఆలస్యం అవుతుందని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగ కొద్దిమంది లబ్ధిదారులకే సాంకేతిక సమస్య వలన డబ్బులు ఖాతాలో జమ కావడం లేదని తప్పనిసరిగా లబ్ధిదారులందరికీ త్వరలోనే తమ తమ ఖాతాలలో డబ్బులు జమ అవుతాయన్నారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టే దశలవారీగా వెంటవెంటనే ఫోటో యాప్ లో అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీవో బాలయ్య, విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి, హౌసింగ్ ఏఈఈ అసనూద్దీన్, ఎంపీవో శ్రీనివాస్,ఆర్ఐ రాజమల్లు, పంచాయతీ కార్యదర్శులు మాధవి, పరమేశ్వర్, విజయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES