- Advertisement -
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో లక్ష్మీనారాయణ అన్నారు. తంగళ్ళపల్లి మండలంలోని బస్వాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న పలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఎంపీడీవో లక్ష్మీనారాయణ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతన ఇళ్లను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వ సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయన్నారు.ఇసుకలో ఎటువంటి జాప్యం చేయబోమని ఇందిరమ్మ లబ్ధిదారులకు హామీలు ఇచ్చారు. ఆయన వెంట యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎగుర్ల ప్రశాంత్, గ్రామ శాఖ అధ్యక్షులు దేవరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
- Advertisement -