నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం ఆలేరు మండలం రాఘవపురం గ్రామంలో దండ్ల నరేష్ చందన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం పట్టుబట్టలు,యటాను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో త్వరితగతిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలన్నారు .రెండో విడతలో మరో కొంత నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. అధికారులు ఇందిర ఇండ్ల లబ్ధిదారులకు వెంట వెంట డబ్బులు వేసేందుకు అప్రమత్తంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొండ్రాజు వెంకటేశ్వర రాజు,మాజీ ఎంపీటీసీ ఆరె ప్రశాంత్ గౌడ్,నమలే రాజయ్య పొద్దుటూరి రమేష్,మామిడాల అశోక్,గ్రామ శాఖ అధ్యక్షుడు ఉపేందర్, తుంగ కుమార్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలి: బీర్ల ఐలయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES