Thursday, April 9, 2026
E-PAPER
Homeజాతీయంఅమరావతిలో రూ.2,534 కోట్లతో నిర్మాణాలు

అమరావతిలో రూ.2,534 కోట్లతో నిర్మాణాలు

- Advertisement -

కేంద్ర మంత్రి వర్గ ఆమోదానికి ఫైల్‌ సిద్ధం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

రూ.2,534 కోట్లతో అమరావతిలో కేంద్ర ప్రభుత్వం నిర్మాణాలను చేపట్టనుంది. అమరావతిలో సెంట్రల్‌ సెక్రెటేరియట్‌ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసిన సీపీడబ్ల్యూడీ కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి పంపింది. అమరావతిలో కామన్‌ సెంట్రల్‌ సెక్రెటేరియట్‌ (సీసీఎస్‌) నిర్మాణం కోసం రూ.1,299.08 కోట్లు, నివాస సముదాయాల (జీపీఆర్‌ఏ) ఏర్పాటుకు రూ.1,234.91 కోట్లతో కూడిన పీఐబీ మెమోరాండం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాలంటే క్యాబినెట్‌ సెక్రెటేరియట్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు క్లియరెన్స్‌ రావాల్సి ఉంది. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ వెలువడిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఏపీ అధికారులు ఇప్పటికే క్యాబినెట్‌ సెక్రెటేరియట్‌కు సమర్పించారు. వచ్చే కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు అనుమతి లభించే అవకాశం ఉంది. ప్రాజెక్టు తదుపరి అనుమతులకు కీలకమైన క్యాబినెట్‌ సెక్రెటేరియట్‌ క్లియరెన్స్‌ మాత్రమే పెండింగ్‌ ఉంది.

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఫైల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆమోదం తెలిపారు.అమరావతిలో కేంద్ర నిర్మాణాల కోసం మొత్తం 22.53 ఎకరాల భూమిని సీఆర్‌డీఏ కేటాయించింది. సీపీడబ్ల్యూడీ కోసం 22.53 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో 5.53 ఎకరాలు సెక్రెటేరియట్‌ నిర్మాణానికి, 17 ఎకరాలు నివాస సముదాయాల (జీపీఆర్‌ఎ) ఏర్పాటుకు కేటాయించారు. క్యాబినెట్‌ సెక్రెటేరియట్‌ నుంచి క్లియరెన్స్‌ వచ్చిన వెంటనే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు జరిగే అవకాశం ఉంది. కామన్‌ సెంట్రల్‌ సెక్రెటేరియట్‌లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అమరావతి కేంద్రంగా పని చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మల్టీస్టోరేజ్‌ నివాస సముదాయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -