- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు కరిపే బాలకిషన్ ను ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ పరామర్శించారు. ఈ మేరకు ఆదివారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కరిపే బాలకిషన్ ను కలిశారు. సంఘటన జరిగిన తీరును బాధితుడు కిషన్ ను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అందిస్తున్న వైద్యం గురించి ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఉప సర్పంచ్ అశోక్ వెంట మాజీ ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, ఆకుల బాలకృష్ణ, తదితరులు ఉన్నారు.
- Advertisement -



