- Advertisement -
నవతెలంగాణ- రాయపోల్ : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని హైదరాబాద్ కోకాపేటలో క్రిస్ విల్లాలోని వారి నివాసంలో శుక్రవారం పరామర్శించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి మోహన్ రెడ్డి తెలిపారు. అనంతరం సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించారు. వారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, నాయకులు నరసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, దేశమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    