నవతెలంగాణ – తాడ్వాయి : బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తాడ్వాయి మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి హర్ట్ కు సంబంధించిన అనారోగ్యంతో స్ట్రట్ వేసుకొని వైద్యం పొంది, ఇంటివద్ద విశ్రాంతి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర రైతు విమోచన కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, బీరెల్లి మాజీ సర్పంచ్ జాజ చంద్రం, మండల మహిళా అధ్యక్షురాలు సోమ నాగమ్మలతో కలిసి పరామర్శించారు. వారి బాగోగులు ఆరోగ్య సంబంధించిన తదితర విషయాలను చర్చించారు. సమయానికి మందులు వేసుకోవాలని సూచించారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి వెంట విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు నువ్వుశెట్టి రాము, ఎంపిటిసి పరిధి సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ బాసాని రామకృష్ణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్ రెడ్డికి పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES