నవతెలంగాణ – రాయపర్తి
మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గారె నరేష్ ఇటీవల డబుల్ టైపాడ్ జ్వరంతో అశ్వస్వతకు గురై విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం నరేష్ ను పరామర్శించి ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే యువకుడు విష జ్వరంతో అస్వస్థకు గురికావడం బాధాకరమన్నారు.
అందరితో కలివిడిగా ఉండే నరేష్ అతి త్వరలో ఆరోగ్యంగా కోలుకొని క్షేమంగా ఉండాలని కోరారు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి తాజా మాజీ సర్పంచ్ గారె నర్సయ్య, మాజీ ఎంపీటీసీ ఐత రాంచందర్, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ప్రతినిధి గజావెల్లి ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు సుధాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి చందు రామ్, దేవస్థాన మాజీ డైరెక్టర్ చిన్నల ఉప్పలయ్య, మండల పార్టీ ముఖ్య నాయకులు పోగులకొండ వేణు, ఎండీ అక్బర్, ఎండీ యూసఫ్, ఉబ్బని సింహాద్రి, బల్లెం యాదగిరి, మైస వెంకటేశం, పెద్దగోళ్ళ రాజు, కుంట రాంబాబు, ఐత రాజు, బండారి అశోక్, పెద్దగోని జీవన్, చందు లక్ష్మన్, ఐత జంపి, పిరని రాజు, ఎండీ యకూబ్, గారె విష్ణు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ యువ నాయకుడికి పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES