– పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వినియోగదారులకు ఉన్న హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో రాష్ట్రస్థాయి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం పౌరులకు విద్యార్థులకు వారి ప్రాథమిక హక్కుల గురించి అవగాహన కల్పించడం, వినియోగదారుల వివాదాలను సమర్థవంతంగా ఎదుర్కొవడం, వేగంగా పరిష్కరించడంలో డిజిటల్ ప్లాట్ ఫారమ్‌ల ప్రాముఖ్యతపై ఐదురోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ‘వినియోగదారుల హక్కులు…చట్టం’ అనే అంశంపై కళాశాలలు, పాఠశాలల్లో వ్యాస రచన, వక్తృత్వ పోటీలను నిర్వహించామన్నారు. అనంతరం మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన (36) విజేతలకు రూ.5000, రూ.3000, రూ.2000 చొప్పున నగదు బహుమతితోపాటు సర్టిఫికెట్లను అందజేశారు.
వినియోగదారుల హక్కులు తెలుసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



