- Advertisement -
ముంబయి : ప్రముఖ ఫండ్ హౌస్‌లలో ఒక్కటైన ఎల్‌ఐసీ మ్యూచుల్ ఫండ్ కొత్తగా ఎల్‌ఐసీ ఎంఎఫ్ కన్జంప్షన్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ నూతన ఎన్‌ఎఫ్‌ఓ అక్టోబర్ 31న తెరుచుకుంటుందని.. నవంబర్ 14తో ముగుస్తుందని ఆ సంస్థ తెలిపింది. నిరంతరం అమ్మకం, కొనుగోలు కోసం తిరిగి నవంబర్ 25న తెరుచుకుంటుంది. 2025న తిరిగి తెరవబడుతుంది. ఈ స్కీమ్‌కు ఫండ్ మేనేజర్లుగా సుమిత్ భట్నాగర్, కరణ్ దోషి వ్యవహరిస్తారు. ఈ ఎన్‌ఎఫ్‌ఓ కనీస దరఖాస్తు మొత్తాన్ని రూ.5,000గా నిర్ణయించింది. ఎస్‌ఐపీ ద్వారా నెలకు కనీసం రూ.200 పెట్టుబడిగా పెట్టుకోవడానికి వీలుంది.
- Advertisement -

 
                                    