ఒక్కసారిగా ఎగిసిన మంటలు..
తృటిలో తప్పిన పెను ప్రమాదం..
భయపడ్డ స్థానికులు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి టోల్ ప్లాజా వద్ద సోమవారం అనుకోని సంఘటన చోటు చేసుకుంది. నిమిషాల వ్యవధిలోనే ఘటన జరగడం స్థానికుల్ని ఆశ్చర్యానికి లోనే చేసింది. వివారాల్లోకి వెళ్తే.. టోల్ ప్లాజా దగ్గర కంటైనర్ కు సంబంధించిన డబ్బులు చెల్లించి పక్కకు నిలుపుకుని, కంటైనర్ నుండి డిజిల్ తిస్తుండగా.. ప్రమాద వశాత్తూ కొద్ది సెకండ్ ల వ్యవధిలోనే మంటలు ఎగిసి పడి దగ్ధం అయ్యింది. ఒక్కసారిగా ఎగిసిన మంటలతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుకొచ్చారు.
సమయానికి స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, లీడింగ్ ఫైర్ మాన్ ప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అపివేయడంలో విజయవంతమయ్యారు. దీంతో కంటైనర్‌లో ఉన్న సరుకు సురక్షితంగా బయటపడింది. లేకపోతే భారీ ఆర్థిక, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతే కాకుండా రహదారిపై వాహనాలు రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయేవని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే అగ్నికి అహుతైన కంటైనర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు.