క్రెమ్లిన్ వెల్లడి
మాస్కో : రష్యా, అమెరికా అధికారులు ఫోన్‌లో మాట్లాడుకున్నారని, ఉక్రె యిన్‌పై తమ చర్చలను కొనసాగించేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయని క్రెమ్లిన్ శుక్రవారం ధృవీకరించింది. అమెరికా నుండి రష్యా ఆర్థిక దూత కిరిల్ దిమిత్రెవ్ తీసుకువచ్చిన పత్రాలను మాస్కో విశ్లేషించిన అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు ఈ ఫోన్ సంభాషణ జరిగిందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ విలేకర్లకు తెలిపారు.
ఈ ఫోన్ సంభాషణల్లో రష్యా అధ్యక్ష భవన సహాయకుడు యూరి యుష్ కొవ్, పలువురు వైట్‌హౌస్ అధికారులు పాల్గొన్నారని పెస్కొవ్ తెలిపారు. అంత కుమించి వివరాలు వెల్లడించలేదు. గత ఆదివారం ఫ్లోరిడాలోని మియామిలో అమెరికా అధికారులతో సమావేశం జరిపిన అనంతరం దిమిత్రెవ్‌కు ఈ శాంతి ప్రణాళికను అందచేశారు. అనంతరం దిమిత్రెవ్ అందచేసిన ఉక్రెయిన్ శాంతి ప్రణాళికను మాస్కో విశ్లేషించిందని క్రెమ్లిన్ తొలుత వెల్లడించింది.
28న ట్రంప్‌తో భేటీ అవుతా : జెలెన్‌స్కీ
ఈ నెల 28న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అవుతానని, ఉక్రెయిన్‌కు ఇచ్చే భద్రతా హామీలపై ఇరువురం చర్చలు జరుపుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. చర్చించాల్సిన 20 సూత్రాల ప్రణాళిక దాదాపు 90శాతం సిద్ధమైందన్నారు. యుద్ధాన్ని ముగించే ప్రణాళికలో భాగంగా ఉక్రెయిన్ తూర్ప పారిశ్రామిక ప్రాంతం నుండి బలగాలను ఉపసంహరించుకోవడానికి తాను సుముఖంగా వున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా కూడా ఆ ప్రాంతం నుండి వెనక్కి మళ్లాలని, దాన్ని నిస్సైనికీకరణ మండలంగా ప్రకటించాలని సూచించారు. శాంతి చర్చల్లో పురోగతి నెమ్మదిగా, నిలకడగా వుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జకరొవా గురువారం చెప్పారు.
ఉక్రెయిన్‌పై అమెరికాతో చర్చలు కొనసాగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



