తిరువనంతపురం : దేశంలో ప్రజాస్వామ్యం నిరంతరం దాడికి గురవుతోందని, స్వేచ్ఛాయుత వాతావర ణంలో ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ విఫలమైందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మండిపడ్డారు. బుధవారం కేరళలోని అలప్పుజలో జరిగిన సిపిఐ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ప్రతినిధుల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లా డారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ను విమ ర్శిస్తూ.. ప్రజల ఓటు హక్కును లాక్కుం టున్నారని మండిపడ్డారు. ”బీహార్‌లోని అర్హులైన ఓటర్లందరికీ ఓటు హక్కును కల్పించడంలో ఈసీ విఫలమైంది. ఇది ఏ రాష్ట్రంలోనైనా జరగవచ్చు. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ .తటస్థంగా వ్యవహరిస్తూ ప్రజల ఓటు హక్కుకు హామీ ఇవ్వాలి. కానీ స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు నిర్వహిం చడంలో ఈసీ విఫలమైంది” అని అన్నారు.
”భారతదేశం తీవ్రమైన ముప్పులను ఎదుర్కొంటోందని అన్నారు. మితవాద శక్తులు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ ఒక నియంతృత్వ శక్తి. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ విభాగం తప్ప మరొకటి కదు. వారు భారతదేశాన్ని నియంతృత్వ రాజ్యంగా, మతపరమైన దేశంగా మార్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు” అని అన్నారు. ఒకేదేశం ఒకే ఎన్నికను తీవ్రంగా విమర్శిస్తూ.. అది ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతమని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భారతదేశాన్ని భిన్న రూపాల, భిన్న సాంస్కృతిక, బహుభాషా దేశంగా గుర్తించడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు భారతదేశాన్ని ఏకరూప దేశంగా మార్చాలని కోరుకుంటున్నాయి. భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాలను కూల్చివేయాలని కోరుకుంటున్నాయి. మోడీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ముప్పులో ఉన్నాయి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఓడించేందుకు అన్ని లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని అన్నారు. వామపక్షాల ఐక్యత కోసం కృషి చేయాలని, వామపక్ష పార్టీలు ఐక్యమై కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని అన్నారు. మితవాద, ఫాసిస్ట్ శక్తుల నుంచి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నామని, వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. మనం ఆదర్శంగా నివాలని, కమ్యూనిస్ట్ విలువలు , నైతికతను బలోపేతం చేయాలని అన్నారు.
దేశంలో ప్రజాస్వామ్యంపై నిరంతరం దాడి : డి. రాజా
- Advertisement -
- Advertisement -