Monday, October 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రజాసేవ కోసం నిరంతరం కృషి ..

ప్రజాసేవ కోసం నిరంతరం కృషి ..

- Advertisement -

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్..
నవతెలంగాణ – ముధోల్

ప్రజల సేవ కోసం నిరంతరం పనిచేస్తున్నాని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ముధోల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కళ్యాణ్ లక్ష్మి,షాదిముభారక్, 88 చెక్కు లను లబ్దిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై నుండి ఏడూ సార్లు కళ్యాణ్ లక్ష్మి, షాదిముభారక్ చెక్కులను  పంపిణీ చెయటం జరిగింది అని గుర్తు చేశారు. పెండింగ్లో ఉన్న మిగతా చెక్కులను త్వరలో లబ్దిదారులకు  అందజేయున్నట్లు ఆయన పేర్కొన్నారు.  నియోజవర్గంలోని ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానాని అన్నారు. 

దీపావళి తర్వాత సోయా , మొక్క జొన్న, కొనుగోలు కేంద్రాలను ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్, తహశీల్దార్ శ్రీలత, నాయబ్ తహశీల్దార్ తెలంగ్ రావ్, ఆర్ఐ నారాయణ రావు పటేల్, బిజేపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, నాయకులు గంట శ్రీనివాస్, సతీష్ రెడ్డి, నిమ్మ పోతన్న, దత్తాద్రి,  సప్పటోల్ల పోతన్న,టి. రమేష్, లక్ష్మినారాయణ, జీవన్, మోహన్ యాదవ్, సాయినాథ్, కిష్టయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -