సమ్మె నోటీసు అందజేసిన ఫెడరేషన్ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే నెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జె వెంకటేశ్, ఉపాధ్యక్షులు ఎం పద్మశ్రీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె కృష్ణారెడి, కార్యదర్శి జె కుమార స్వామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియామకాల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, డైలీవేజ్, ఎన్‌ఎంఆర్, కంటింజెంట్ వర్కర్లకు ప్రాముఖ్యతనివ్వాలనీ, వారి సర్వీసు ఆధారంగా దశల వారీగా రెగ్యులరైజ్ చేయ్యాలనీ, అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే తదితర డిమాండ్ల పరిష్కారంతో పాటు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల తలపెట్టిన సమ్మెలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తమ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మీ సేవ ఉద్యోగులు వచ్చే నెల 12న కార్మిక సంఘాలు నిర్వహించ తలపెట్టిన ఒక్క రోజు సార్వత్రిక సెమ్మెలో పాల్గొంటున్నారని ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి కి తెలంగాణ మీ-సేవ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు జె వెంకటేశ్, అధ్యక్షులు ఆర్ సురేష్, ప్రధాన కార్యదర్వి వై కవిత, కోశాధికారి ఎవీబీ లక్ష్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ ప్రకాశ్ నాయక్ సమ్మె నోటీసు అందజేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎనిమిది నెల్ల పీఎఫ్ బకాయిలను(ఎంప్లాయీ, ఎంప్లాయర్ వాటా కలిపి) సిబ్బంది పీఎఫ్ ఖాతాల్లో .జమ చేయాలని కోరారు.
సార్వత్రిక సమ్మెలో కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



