– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
– భారీ వర్షంలోను పరిశ్రమ అడ్మిన్ ఆఫీసు ముందు బైటాయించిన కాంట్రాక్టు కార్మికులు
నవతెలంగాణ-చౌటకూర్
సంగారెడ్డి జిల్లా శివంపేట్ సీబీఎల్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ డ్యూటీలు కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, పరిశ్రమ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్ చేశారు. సీబీఎల్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ డ్యూటీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం తలపెట్టిన ఒక్క రోజు సమ్మెలో చుక్కరాములు పాల్గొని ప్రసంగించారు. కార్మికులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సీఐటీయూ ఎర్రజెండా అండగా ఉంటుందన్నారు. యాజమాన్యం సానుకూలంగా స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ డ్యూటీలు కల్పించాలని డిమాండ్ చేశారు. భారీ వర్షంలోనూ పరిశ్రమ అడ్మిన్ ఆఫీసు ముందు కాంట్రాక్టు కార్మికులు బైటాయించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అతిమేల మాణిక్, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాగారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, పర్మినెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రసన్న, కాంట్రాక్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సురేష్, యూనియన్ ఆఫీస్ బేరర్స్, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మికులకు సంఘీభావంగా పర్మినెంట్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. తదనంతరం యాజమాన్యంతో చర్చలు జరపగా సానుకూలంగా స్పందించింది.