నవతెలంగాణ – దుబ్బాక
గ్రామీణ ప్రాంతమైన దుబ్బాకలో ఐటీఐ కాలేజీ భవన నిర్మాణం చేపట్టి ఏడేళ్లు అవుతున్నా.. నేటికీ పనులు పూర్తి కాకపోవడమేంటని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విస్మయం వ్యక్తం చేశారు.పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఐటీఐ కాలేజీ భవన నిర్మాణ పనులను ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. పనుల్లో నిర్లక్ష్యం పట్ల అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు నష్టపోతున్నారని, దుబ్బాక ఎమ్మెల్యే దీనిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. వచ్చే ఆగస్టు లోగా పనులు పూర్తిచేసి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్లలను విజ్ఞప్తి చేశారు.
కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలి : ఎంపీ రఘునందన్ రావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES