Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐఐటీహెచ్ కంది కార్మికులను ఇబ్బంది పెడుతున్న కాంట్రాక్టర్లు

ఐఐటీహెచ్ కంది కార్మికులను ఇబ్బంది పెడుతున్న కాంట్రాక్టర్లు

- Advertisement -

జీతాలు అడిగితే గేటు వద్దే ఆపేస్తారా ?
హౌస్ కీపింగ్ ఉద్యోగుల ఆందోళన
నవతెలంగాణ – కంది
 
మండల కేంద్రంలోని ఐఐటీహెచ్ లో పనిచేసే కార్మికులను కాంట్రాక్టర్లు బయటికి నెట్టివేశారు. జీతాలు రావడం లేదని, ఇదేమిటి అని అడిగితే.. గేటు వద్దే తమను విధుల్లోకి రాకుండా  అడ్డుకున్నారని హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పనిచేసే వారంతా సదరు కాంట్రాక్టర్ ను ప్రతి నెల 10 వరకు కూడా సరిగ్గా జీతాలు అందడం లేదని, అలాగే విధుల్లో తమకు సరైన డ్రెస్సులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ ఐఐటీహెచ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -